నీవు చేసిన మేలు మరువలేను
నా పై చూపిన ప్రేమ విడువలేను #2#
ధీనుడనైన నన్ను దరికి చేర్చితివి
దరిద్రుడ నైన నా పై దయను చూపితివి #2#

యేసు నీ ప్రేమ మరువలేను
నీ స్నేహం విడువలేను
నీతో నే నా జీవితం ….#2#

1. ధనమును నమ్మి దూరమైపోయాను
మనుషులను నమ్మి మరచిపోయాను
మరచిన నన్ను దూరమైన నన్ను
చేరదీసి ప్రేమించితివి …
#యేసు నీ ప్రేమ#

2. లోకమును స్నేహించి వ్యర్దమైపోయాను
పాపమును ప్రేమించి ప్రార్దించకపోయాను
పనికిరాని నన్ను పాపినైన నన్ను
ప్రేమతో పిలచి నూతనపరచితివి ..
*యేసు నీ ప్రేమ*

New song By Noel Evanglist.P & Ropp Jonathan Kati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *